అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు శనివారం ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ గ్రామంలో నేరేళ్ల శ్రీనివాస్ ప్రేమల దంపతుల ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం ఆ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మాజీ ఎంపీటీసీ మేకర్తి శ్రీనివాస్, నాయకులు నిఖిల్, ఆసీఫ్, గాజుల జలపతి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్