ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల పరిశీలన

వాంకిడి మండలంలోని బంబార గ్రామపంచాయతీ గొల్లగూడ వాడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల పురోగతిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఇంటి స్లాబ్ పనులు పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా అందేలా అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నూలి మెంగాజి మాట్లాడుతూ లబ్ధిదారులకు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బెండారే కృష్ణాజి, కడప మారుతి, సెల్వాట్కర్ పెంటు, ధన్వల్కర్ కమలేష్ బంటి, డికొండ మహేష్, చునర్కర్ శివాజీ, మండోకర్ ధధాజీ, పందిర్ల గుండయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕