కాగజ్‌నగర్ ఆశ్రమ పాఠశాలలో పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సేవలు ఎనలేనివని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి గురువారం ప్రశంసించారు. ఆయనకు శాలువాతో సన్మానం చేశారు. ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో కుటుంబంతో సుఖంగా జీవించాలని ఆకాంక్షించారు.