ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్సీ దండే విట్టల్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని "కూలేశ్వరంగా" మార్చిందని విమర్శించారు. డ్రోన్లతో ప్రాజెక్టును చూపించి ప్రజలను మోసగించారన్నారు. అలాగే, డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలకు ఖాళీ హామీలు ఇచ్చారని ఆరోపించారు.