కొమురంభీం: 'సికిల్ సెల్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి'

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉల్లిపిట్టడోర్లి దంతనపల్లె గ్రామంలో మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ తిరుమల బుధవారం పర్యటించి గ్రామస్తులకు సికిల్ సెల్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. ఇది వారసత్వ రక్త రుగ్మతగా, ఎర్ర రక్త కణాలు గొడ్డలి ఆకారంలో ఉండి రక్తప్రవాహాన్ని అడ్డగిస్తాయి. అలసట, నొప్పి, ఇన్ఫెక్షన్లు, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మేనరికం వివాహాలు నివారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్