వాంకిడిలో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం జేత్వాన్ బుద్ధ విహార్లో ఘనంగా నిర్వహించనున్నట్లు లక్ష్మణ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కిర్మీళ్ల వినోద్ దీప ప్రజ్వలన చేయనున్నారు. సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మండల ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.