కొత్తగూడ గిరిజన పాఠశాల 25 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తగూడ (సాకడ) గ్రామంలో 25 సంవత్సరాలుగా మూతపడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల శనివారం గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఏందూర్ శ్యాంరావు చొరవతో పునఃప్రారంభమైంది. దీంతో గ్రామంలో దశాబ్దాలుగా నిలిచిపోయిన విద్యా సేవలు పునరుద్ధరించబడ్డాయి. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా పెందోర్ శ్యాంరావు పటేల్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్