ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం అక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరుతూ సోమవారం పీడీఎస్యూ జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం 1992లో కళాశాల నిర్మాణానికి 10 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, పరిసర ప్రాంతాన్ని స్థానికులు ఆక్రమించారని వారు ఆరోపించారు. విద్యార్థుల ప్రయోజనార్థం స్థలాన్ని రక్షించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని పీడీఎస్యూ సభ్యులు కోరారు.