ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుండే చల్లని గాలులతో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్ మండలంలో వర్షం కురిసింది. కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూరు, దహెగాం, చింతలమానేపల్లి, పెంచికల పేట, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, జైనూరు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. కాగా వాతావరణశాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది.