విధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని కొమురంభీం జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. బుధవారం చింతలమానేపల్లి మండలం దీందా పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చేందుకు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు.