మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10వేలు చెల్లింపులు చేయాలి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జె. రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రూ. 10, 000 చెల్లించాలనీ, ఇందుకు అసెంబ్లీ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, గుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి, మెనూ చార్జీలు పెంచాలి, ప్రతి పాఠశాలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. గుర్తింపు కార్డులు, యూనిఫాం, సామాజిక భద్రత, బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్