తుమ్రిగూడలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ప్రజలకు ఇబ్బందులు

ఆసిఫాబాద్ మండలం తుమ్రిగూడ కాలనీలో వారం రోజులుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కొనసాగుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు బుధవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్