రాష్ట్ర గవర్నర్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ అంశాలపై కూడా వీరిద్దరి మధ్య స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్