రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కు దేవాదాయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.