చింతలమానేపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబు జాగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్‌పీఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాబు జాగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు గోగార్ల పోచయ్య, గౌరవాధ్యక్షుడు నందిపేట రామయ్య, నాయకులు ఇప్ప శ్రీనివాస్ (తెలంగాణ శ్రీను), ఇప్ప శంకర్, గోలేటి భాస్కర్, ఇప్ప పారదేశీ, ఇప్ప జగదీష్, ఏముర్ల శ్రవణ్, కంబాల అంజి తదితరులు పాల్గొన్నారు.