అక్రమ ఇసుక రవాణాపై అధికారుల కొరడా

కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ ఆదేశాల మేరకు సిర్పూర్‌-టి మండలంలో అధికారులు తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. తహసీల్దార్‌ మహమ్మద్‌ రహీముద్దీన్‌, ఎస్‌ఐ వెంకటేష్‌ ఈ తనిఖీలు చేపట్టారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి సబ్‌కలెక్టర్‌ ఎదుట బైండోవర్‌ చేయనున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕