కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఆదివారం తొమ్మిదో రోజుకు చేరిన సమ్మెలో సీఐటీయు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్ వాడీలకు నష్టం కలిగించే జీవో నం. 10ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ సదుపాయాలు టీచర్లకు రూ. రెండు లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష అమలు చేసి పింఛన్ వసతి కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్