ఆసిఫాబాద్ జిల్లా గురుకులాల్లో పని చేస్తున్న గెస్ట్, పార్ట్‌టైమ్, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఏడాది పొడవునా (12 నెలలు) వేతనం ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శనివారం వైద్య శాంతి కుమారి కోరారు. రెగ్యులర్ ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, గురుకులాల్లో ప్రత్యేక వార్డెన్లను నియమించాలని డిమాండ్ చేశారు.