కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబర గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభిమానులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుతూ హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, పాదయాత్రలో పాల్గొంటున్న అభిమానులకు కండువాలు కప్పి సంఘీభావం తెలిపారు. గాంధీ చూపిన సత్యం, అహింస, ప్రజాసేవ మార్గాలు అందరికీ ఆదర్శమని శ్యామ్ నాయక్ పేర్కొన్నారు.