ఆదిలాబాద్ జిల్లా తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యూ టి యు) జిల్లా కార్యవర్గం మంగళవారం రెండు వివాహ కార్యక్రమాలలో పాల్గొంది. ఇంద్రవెల్లి సాకేర గ్రామంలో సి ఆర్ టి రాథోడ్ హిరామన్ కుమారుని వివాహ విందుకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆదిలాబాద్ నగరంలోని తనీషా గార్డెన్‌లో జరిగిన జాదవ్ సంగీత–రమేష్ దంపతుల పుత్రిక రాజేశ్వరి–అశ్విన్ కుమార్ వివాహానికి జిల్లా ఉపాధ్యక్షులు పూర్కా ఉద్దవ్ నైతం కృష్ణారావ్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శి మాడావి గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కూడ్మేత అనంత్ కూడా పాల్గొన్నారు.