ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. దుర్గం ప్రశాంత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల బిజెపి యువ నాయకుడు దుర్గం ప్రశాంత్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు రూ. 1లక్ష, తులం బంగారం హామీని అమలు చేయాలని, యువతకు రాజీవ్ యువ వికాసం లోన్లు అందించాలని, అర్హులైన ప్రజలకు 6గ్యారంటీలను ప్రతి ఒక్కరికి అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్