కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఇందిరానగర్ గ్రామంలో వికలాంగురాలు సుగుణ మృతి చెందగా, అర్చకుడు దేవర వినోద్ స్వామి శుక్రవారం ఆమె కుటుంబానికి అంత్యక్రియల కోసం రూ. 5000, నిత్యావసరాలు అందించారు. గతంలో కూడా ఆయన సుగుణ కుమార్తె వివాహానికి సహాయం చేశారు. గ్రామస్థులు ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు.