ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో రైస్మిల్ యజమానుల అరెస్ట్

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రబీ 2023–24 సీజన్‌కు సంబంధించిన సుమారు 1825 మెట్రిక్ టన్నుల CMR బియ్యాన్ని అక్రమంగా విక్రయించిన కేసులో శ్రీ సాయి బాలాజీ అగ్రోటెక్ రైస్ మిల్ యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి అందించాల్సిన రూ. 6.91 కోట్ల విలువైన ధాన్యాన్ని కోళ్ల దాణా వంటి అవసరాలకు అమ్మి రూ. 3.8 కోట్ల లాభం పొందినట్లు విచారణలో తేలింది. వీరు రూ. 7.51 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీ కేసులోనూ నిందితులుగా ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్