కలెక్టరేట్‌లో ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభం

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనకాపూర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్‌తో కలిసి ప్రారంభించారు. వివిధ పనులు, ప్రజావాణి నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే వందలాది మంది దాహార్తి తీర్చేందుకు ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద రూ. 2 లక్షల వ్యయంతో బ్యాంక్ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్