కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలోని ఓ బంగారు దుకాణంలో శనివారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ బద్దలు కొట్టి 9 గ్రాముల బంగారం దొంగిలించారు. షట్టర్ తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మధుకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.