ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బానర్ కొసార గ్రామానికి చెందిన రైతు తపాసే శ్యామ్ రావు వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు రూ.75 వేల నగదును దొంగిలించారు. వాంకిడి ఎస్‌బీఐ నుంచి డబ్బులు తీసుకుని బైక్ ముందు కవర్‌లో ఉంచుకున్న రైతును పథకం ప్రకారం డైవర్ట్ చేసి, డబ్బులు అపహరించినట్లు సమాచారం. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.