కన్నెపల్లిలో సంకల్ప్ గ్రామసభ

కొమురంభీమ్ జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్‌లోని కన్నెపల్లి గ్రామ పంచాయతీలో బుధవారం GPDPలో భాగంగా సంకల్ప్ గ్రామసభ జరిగింది. ఈ సభలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలపై చర్చించారు. గ్రామస్తులు తమ సమస్యలు, సూచనలను తెలియజేయగా, వాటిని ప్రణాళికలో చేర్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర్లె పార్వతి, ఉప సర్పంచ్ మోర్లె సమత–రాజు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్