పెంచికల్‌పేట్ ఎస్సైపై సర్పంచ్ ఫిర్యాదు

పెంచికల్పెట్ మండలం దరోగపల్లి సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి, పెంచికల్‌పేట్ ఎస్సైపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సమక్క–సారక్క జాతరకు వెళ్తున్న సమయంలో జరిగిన వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసును తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు. అనంతరం తనపై కక్ష సాధింపుతో గ్రామంలో వ్యంగ్యంగా మాట్లాడటం, పోలీస్ స్టేషన్‌లో అవమానకరంగా ప్రవర్తించారని తెలిపారు. ఏప్రిల్ 25న మరో ఫిర్యాదు కోసం వెళ్లినప్పుడు కూడా గౌరవం లేకుండా మాట్లాడారని పేర్కొన్నారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్