బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సతీష్ బాబు సన్మానం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుడు, న్యాయవాది బోనగిరి సతీష్ బాబు నాలుగోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ సతీష్ బాబు నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందకరమని తెలిపారు. ప్రజలకు న్యాయం అందించే దిశగా మరింత కృషి చేయాలని, పెద్దలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్