కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం బడిబాట నిర్వహించారు. సిర్పూర్, ఆసిఫాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లు, భోజనం అందిస్తున్నట్లు రాథోడ్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.