కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వాంకిడి మండలంలో షీ టీం, ఏహెచ్టీయూ బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు, చిన్నారుల భద్రత, లింగ సమానత్వం, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు వివరించారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగంపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.