ఆసిఫాబాద్ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను గుర్తించిన అధికారులు షీ టీంకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన షీ టీం సిబ్బంది మహిళ వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులను సంప్రదించి సురక్షితంగా అప్పగించారు. అదే సమయంలో ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని కౌన్సిలింగ్ చేసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బిక్కులాల్, సిబ్బంది స్వప్న పాల్గొన్నారు. మహిళల భద్రతకు షీ టీం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని పోలీసులు తెలిపారు.