బంబారాలో NSS ఆధ్వర్యంలో శ్రమదానం, విద్యార్థుల భాగస్వామ్యం

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో శుక్రవారం మూడవ రోజు శ్రమదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గ్రామ పరిసరాలను శుభ్రపరిచారు. సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించడంలో NSS పాత్ర కీలకమని వక్తలు తెలిపారు. గ్రామ సర్పంచ్ బెండారె కృష్ణాజీ స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత ముందుండి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. దేవేందర్ విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్