కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని వాంకిడి మండలం ఖమన గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మండల మాజీ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ, గ్రామ సర్పంచ్ సునీత, మండల ఉపాధ్యక్షుడు పెంటు, యువజన అధ్యక్షుడు ఉప్పుల కృష్ణ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.