కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం 11వ వార్డు సందీప్ నగర్‌కు చెందిన పెండ్యాల శారదకు అత్యవసరంగా B+ve రక్తం అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ వైశ్య ఫౌండేషన్‌కు చెందిన సామాజిక కార్యకర్త మాడిశెట్టి ప్రశాంత్ వెంటనే స్పందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో రక్తదానం చేశారు. ఆయన సకాలంలో స్పందించడంతో శారద కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.