ఆసిఫాబాద్ జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రాథమిక ఆంగ్ల ఉపాధ్యాయులకు 'వైభ లీప్ ఫార్వర్డ్' ఆధ్వర్యంలో గురువారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, ఉపాధ్యాయులు ఆంగ్ల భాష అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గతేడాది మంచి ఫలితాలు వచ్చినందున, ఈ ఏడాది కూడా విద్యార్థుల ఆంగ్ల సామర్థ్యాల పెంపుకు కృషి చేయాలని కోరారు.