పల్స్ పోలియో కార్యక్రమాన్ని తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్

మంచిర్యాల జిల్లాలోని తిర్యాణి మండలంలో కొనసాగుతున్న జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని స్టేట్ అబ్జర్వర్ శ్రవణ్ రెడ్డి పరిశీలించారు. ఆయన హెల్త్ ఎడ్యుకేటర్ ఎం. డి. రషీద్‌తో కలిసి మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మంగి, రొంపల్లి పోలియో బూత్‌లను సందర్శించారు. 53 బూత్‌ల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న తీరు, వ్యాక్సిన్ కోల్డ్ చైన్, సిబ్బంది హాజరు, హౌస్ మార్కింగ్‌ను పరిశీలించి, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయాలని, బూత్ డే అనంతరం ఇంటింటి సర్వేలో మిగిలిన పిల్లలను గుర్తించి టీకాలు వేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్