కొమురం భీం జిల్లాలో పక్షులకు, మనుషులకు ప్రాణాంతకంగా మారిన చైనా మాంజ (నైలాన్ దారం)ను పూర్తిస్థాయిలో నిషేధించేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చైనా మాంజ నిల్వలు, అక్రమ విక్రయాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి ఇప్పటికే పలుచోట్ల స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. చైనా మాంజ వల్ల పక్షులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు, పాదచారులకు తీవ్ర గాయాలు జరిగే ప్రమాదం ఉందని, దీని విక్రయం, వినియోగం నేరమని హెచ్చరిస్తూ, దుకాణదారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.