సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ

ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో అవహేళన వ్యాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేసి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం నేరమని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్