కొమురం భీం జిల్లాలో కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేసి, నిరంతర వాహన తనిఖీలు, గస్తీ ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.