జైనూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నూతన విద్యార్థినులకు స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆమె మెమొంటోలు అందజేసి అభినందించారు. విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సుగుణక్క సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు.