రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వేతనాల ఆలస్యం, తక్కువ కూలి, పనిస్థలాల్లో సౌకర్యాల లేమి తీవ్ర సమస్యలని ఆయన తెలిపారు. బడ్జెట్ కోతలతో పథకం బలహీనపడి, కూలీల వలసలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పని దినాలు 200కు, రోజుకూలీని రూ. 600కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.