అంజన్నను భక్తితో మొక్కిన కోతి

ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలోని రామాలయంలో ఆదివారం ఒక కోతి నేరుగా హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి మొక్కింది. అనంతరం తీర్థాన్ని తాగి స్వామివారి చెంతనే గడిపింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. కొందరు వానరాన్ని హనుమంతుడి స్వరూపంగా భావించి పూజలు చేశారు. ఈ సంఘటనతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్