వర్షాలతో నిలిచిపోతున్న రాకపోకలు!

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుండి వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా వంతెన పనులు పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర వైద్య సేవలు కూడా అందడం లేదని, నడుము లోతు నీళ్లలో వాగు దాటుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్