హోలీ పండుగ విషాదం: బైక్-కారు ఢీ, ఒకరి మృతి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హోలీ పండుగ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలంలోని నారాయణపూర్, కిష్టాపూర్ రోడ్డుపై బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ (32) అక్కడికక్కడే మృతి చెందగా, బైక్‌పై ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. స్నేహితులతో కలిసి హోలీ ఆడుకుని, స్నానం కోసం బైక్‌పై సమీప వాగుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్