పంచాయతీ ఎన్నికల నియమావళి కారణంగా డిసెంబర్ 9న జరగాల్సిన ఆదివాసి పోరు గర్జన సభను తుడుందేబ్బ నాయకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ వాయిదా తీర్మానాన్ని తుడుందేబ్బ జిల్లా జనరల్ సెక్రటరీ పెందోర్ మారుతీ, కుమ్రం భీం జిల్లా ఎస్పీ నితికా పంత్ కి మంగళవారం లిఖిత పూర్వకంగా అందజేశారు. త్వరలోనే సభకు కొత్త తేదీని ప్రకటిస్తామని నాయకత్వం తెలిపింది.