దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళి

కుమురం భీమ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ సభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీపాదరావు శాసనసభ్యుడిగా, సభాపతిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని, సభను నిష్పక్షపాతంగా నడిపి అధికార–విపక్షాలకు సమాన న్యాయం చేసిన నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. శాసనసభ గౌరవం, నియమావళి పటిష్టతకు ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించిన సరళ జీవనశైలి కలిగిన విలువల నాయకుడిగా ఆయనను స్మరించారు.

సంబంధిత పోస్ట్