గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ శ్రద్ధాంజలి

ఆసిఫాబాద్ గాంధీ చౌక్‌లో గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ సభ్యులు మల్టిపుల్ శ్రీ ఎక్కిరాల శ్రీనివాస్, టీవీ నంది పురస్కార గ్రహీత నాగబాల సురేష్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, ఆయన ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆసిఫాబాద్ ప్రజలు, ఆర్యవైశ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధ్యక్షుడు మర్యాల ఉదయభాబు, కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్