సామెల గ్రామంలో పింఛన్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రారంభం

కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని సామెల గ్రామంలో సర్పంచ్‌ సంతోష్‌ మరియు కార్యదర్శి విలాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం పింఛన్‌ లబ్ధిదారుల వివరాల వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టారు. గ్రామంలోని పింఛన్‌ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు, అర్హతలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్‌లో భాగంగా అవసరమైన పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో వర్కిన్‌పిటార్‌ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕