సర్పంచుల అవినీతిపై గ్రామస్తుల ఫిర్యాదు, ఎదురుకేసుల ఆరోపణలు

కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్‌లోని కేరమేరి మండలంలోని పరండోలి, ముఖదంగూడా సర్పంచులు అభివృద్ధి పనుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని గ్రామస్తులు గత సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ అవినీతి బయటపడుతుందనే భయంతో సర్పంచులు ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్‌పై ఎదురు కేసు నమోదు చేయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఫిబ్రవరి 15న కేరమేరి మండల కేంద్రంలో జరిగిన సేవాలాల్ జయంతి శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమానికి పరండోలి సర్పంచ్ భర్త, కానిస్టేబుల్ చరణ్ రాథోడ్ ఫిబ్రవరి 13న ఫోన్‌పే ద్వారా రూ. 3,000 చందాగా చెల్లించినట్లు కమిటీ డైరీలో నమోదైంది.

సంబంధిత పోస్ట్